After 70 Years Crossing, Venkaiah Naidu would like to retire from Politics. Once upon a time, public gave the money for election expenditure. But, Now The political candidates expenditure as crores of rupees. He Participated in Guntur Club programme and he expressed his words. He also said that, dont wait for exit polls and see for exact polls.
#exitpoll
#loksabhaelections2019
#venkaiahnaidu
#pmnarendramodi
#bjp
#vicepresident
70 ఏళ్ల తర్వాత రాజకీయాలను వదిలేయానుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. 42 ఏళ్ల తర్వాత తాను ఎన్నికల బరిలో లేకుండా ఈసారి ఎన్నికలు జరిగాయని చెప్పుకొచ్చారు. అలా ప్రజలకు దూరమైనప్పటికీ గౌరవప్రదమైన పదవిలో ఉన్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం (19.05.2019) నాడు గుంటూరు క్లబ్‌లో జరిగిన ఓ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ప్రజలు ఇచ్చిన విరాళాల సొమ్ముతోనే ఎన్నికల్లో పోటీ చేశామని.. కానీ ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న కొందరు నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.